చంద్రగిరి: పాకాల ఆర్టీసీ కంట్రోలర్ నిజాయితీకి ప్రశంసలు

పాకాల ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో పాటు విలువైన పత్రాలను ఆర్టీసీ కంట్రోలర్ చంద్ర, ఆర్ అండ్ బీ శాఖలో డీఈగా పనిచేస్తున్న వెంకట్‌కు తిరిగి అప్పగించారు. వెంకట్ తిరుపతి నుంచి పుంగనూరుకు ప్రయాణిస్తుండగా బస్టాండ్‌లో తన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను మరిచిపోయారు. అందులో ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉండటంతో ఆందోళనకు గురైన బాధితుడికి, బ్యాగ్‌ను గుర్తించిన కంట్రోలర్ చంద్ర భద్రపరిచి, సంప్రదించి అప్పగించారు. తన విలువైన వస్తువులు తిరిగి అందించినందుకు వెంకట్ కంట్రోలర్ చంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్