చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న మహాప్రస్థానం వాహనాన్ని మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్. నాగరాజు కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ వాహనం సామాన్య, నిరుపేదలకు అంత్యక్రియల కోసం పార్థివదేహాలను తరలించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం, సీపీఐ నాయకత్వం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డాక్టర్ ఓ. చంద్రమ్మ ద్వారా మెడికల్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించింది.