అన్నదాత సుఖీభవ పథకం అమలుపై గురువారం సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆగస్టు 2న పథకం ప్రారంభం కానుండటంతో అన్ని సచివాలయాల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో 2. 11 లక్షల అర్హుల్లో 2. 04 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేశారని తెలిపారు.