చిత్తూరు: శిక్షణ పై వెళ్లనున్న జిల్లా కలెక్టర్

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఈనెల 11వ తేదీ నుండి కలెక్టర్లకు మిడ్ కేరీర్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ శిక్షణలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా పాల్గొననున్నారు. మొత్తం 25 రోజుల పాటు సాగే ఈ శిక్షణ జూన్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత, సుమిత్ కుమార్ జూన్ 6వ తేదీన జిల్లాకు తిరిగి వస్తారు.

సంబంధిత పోస్ట్