చిత్తూరు: నాన్-కేడర్ ఎస్పీ గా రాజశేఖర్ రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అడిషనల్ ఎస్పీలకు నాన్-కేడర్ ఎస్పీ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతిలో భాగంగా నాన్-కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఎస్. ఆర్. రాజశేఖర్ రాజు, సోమవారం చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నాన్-కేడర్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ఆయన జిల్లా ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్