మద్యం సేవించి వాహనం నడిపిన నలుగురికి జరిమానా

చిత్తూరులో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ నలుగురికి కోర్టు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు గురువారం తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడటంతో కోర్టులో హాజరుపరచగా ఈ శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడిపితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్