బ్రాహ్మణపల్లి పిడిఓ సస్పెండ్

శనివారం, జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, బ్రాహ్మణపల్లె పంచాయతీ పిడిఓ బాలసుబ్రహ్మణ్యంను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. బొమ్మయ్య పల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉపాధి హామీ పథకంలో రూ. 2. 75 లక్షలు డ్రా చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్