జీడి నెల్లూరు నియోజకవర్గంలో అమలవుతున్న గృహ నిర్మాణాల పురోగతిపై గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ గృహ నిర్మాణాలు వారాంతపు లక్ష్యాలకు అనుగుణంగా, వేగవంతంగా కొనసాగాలని సూచించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రోజువారి పర్యవేక్షణతో నిర్మాణాల పురోగతి మెరుగు పరచాలన్నారు.