పాలసముద్రం: మా నీటి కష్టాలు తీరుస్తారా లేదా...

తమ గ్రామాలలో తాగునీటి కోసం కష్టాలు పడుతున్నామంటూ జీడి నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం బలిజకండ్రిగ, కొత్తపల్లి గ్రామ ప్రజలు సోమవారం రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆరోపిస్తూ, పంచాయతీ కార్యదర్శి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో సతీష్ కుమార్ సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించి, నీటి సరఫరాను చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు.

సంబంధిత పోస్ట్