చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం సర్కిల్ పరిధిలోని వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ నిర్వహణ, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.