గురువారం నాడు జీడి నెల్లూరు నియోజకవర్గంలోని వెదురు కుప్పం ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సూచించారు.