గూడూరు మండలం వెడిచర్ల గ్రామంలో దాదాపు 50 ఏళ్లుగా పశువుల మేతకు వినియోగిస్తున్న భూమిని రికార్డులను తారుమారు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీనిపై దళితులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమణకు పాల్పడిన అగ్రవర్ణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.