గూడూరు: ఇళ్ల తొలగింపుపై గిరిజనుల ఆందోళన

చిల్లకూరు మండలం లింగవరం పంచాయతీ పరిధిలోని తీగలపాలెం గ్రామ గిరిజనులు శనివారం క్రిస్ సిటీ పనులు చేపడుతున్న బీవీఎస్ఆర్ కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. పునరావాసం, నష్టపరిహారం కల్పించకుండా రహదారి నిర్మాణం కోసం 14 గిరిజన కుటుంబాల ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్