చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొసలి మడుగు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించారు. ఐదు రోజులు పట్టాల్సిన పైపులైన్ పనులను కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసి, గ్రామానికి తాగునీటిని సరఫరా చేశారు. ఈ సత్వర స్పందన పట్ల గ్రామస్తులు సంబంధిత ఆర్ డబ్ల్యూ యస్ అధికారులను అభినందించారు.