కాణిపాకం: దేశ దృష్ట్యా గోశాలలో ప్రత్యేక చర్యలు

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన గోశాలలో ఈవో పెంచల కిశోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గోవులకు సమయానికి మేత, పశుగ్రాసం, తాగునీరు అందించాలని, ఎండ తాపాన్ని తగ్గించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. గోశాలను పరిశుభ్రంగా ఉంచుతూ, గోవుల ఆరోగ్యంపై పశువైద్యుడి పర్యవేక్షణ ఉండాలని, సిబ్బంది తప్పనిసరిగా అన్ని సూచనలను పాటించాలని ఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్