కుప్పంలో సింగల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకంపై కడప పీడీ వికాస్ మర్మత్ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శనివారం ఆయన కుప్పం పట్టణంలోని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సింగల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు విక్రయిస్తున్న దుకాణదారులను మందలించారు. ఇకపై సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే దుకాణాల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు.