చిత్తూరు జిల్లా కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈ సందర్భంగా శాంతిపురం మండలంలోని కడపల్లిలోని తన నివాసం వద్ద సీఎం చంద్రబాబు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తన ఇంటి నుంచి ఎలక్ట్రిక్ సైకిల్ పై తులసినాయనపల్లి సమీపంలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా కుప్పం నియోజకవర్గంలో ఈ-సైకిళ్ల పంపిణీలో ఒక నూతన అధ్యాయం లిఖించబడింది.