కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించకుండా మున్సిపల్ అధికారులు ముందస్తుగా పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కాలువలను శుభ్రం చేసి అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.