కుప్పంలో ఈనెల 30 వరకు పోలీస్ యాక్ట్: డీఎస్పీ

చిత్తూరు జిల్లా, కుప్పంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ పార్థసారథి గురువారం తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టామని, పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని, ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని డీఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్