తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎస్ విజయానంద్‌కు ఏకసభ్య కమిషన్ తన నివేదికను శుక్రవారం అందజేసింది. ఈ నివేదికను ఆయన రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి రోజున టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.