మదనపల్లె: ముమ్మరంగా వాహనాల తనిఖీలు

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో శుక్రవారం ఉదయం డీఎస్పీ మహేంద్ర నేతృత్వంలో పోలీసులు జోరుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాల కు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో మదనపల్లిలో ప్రతిరోజు ప్రధాన కూడలిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక బీసెంట్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సీఐ మోహన్ కుమార్, 1టౌన్, 2టౌన్ సీఐ రామచంద్ర, ఎస్సై లతో కలిసి తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్