చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలం, పర్వత రాజపురం బీటీ రోడ్డు నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోడ్డు నిర్మాణానికి రూ 1 కోటి ఏడు లక్షల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.