పుత్తూరు: వ్యాసరచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులు

చిత్తూరు జిల్లా స్థాయిలో పి వి కే ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సమాచార హక్కు చట్టంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు అయినటువంటి లావణ్య వ్యాసరచన పోటీలలో ప్రధమ స్థానం, వరలక్ష్మి ఉపన్యాస పోటీలలో మొదటి స్థానం కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థినిలను కళాశాలలో అభినందించారు.

సంబంధిత పోస్ట్