పలమనేరు: పింఛన్ పంపిణీ

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు, వార్డ్ ఇన్ ఛార్జ్ లు లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తున్నారు. ఉదయమే పింఛన్ నగదు చేతికి అందడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్