పలమనేరు: వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

పలమనేరు పరిధిలోని క్యాటెల్ ఫామ్ జంక్షన్ లో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు శనివారం పోలీస్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనాల రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని డ్రైవర్లను హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్