28/4/26 మంగళవారం, పలమనేరు పట్టణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన నీటి వనరు అయిన కాలువపల్లి రిజర్వాయర్ నుండి నీటి సరఫరా చేసే పైప్ లైన్ 27/4/26 న లీక్ అయింది. ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నందున, రాబోయే రెండు రోజులు పాటు పలమనేరు పట్టణంలో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పురపాలక సంఘ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. కావున, పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.