కె. వి పల్లి మండలం సొరకాయల పేట గ్రామం మిన్నంరెడ్డి గారి పల్లి అంగన్వాడి సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ను ఐసిడిఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అన్నపూర్ణ, అంగన్వాడి వర్కర్స్ గర్భవతులు బాలింతలు, తల్లులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అన్నపూర్ణ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రుపాలు, కేవలం 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు.