దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి జ్వరాలతోపాటు బోధకాలు, మెదడువాపు వ్యాధులు కూడా వస్తాయని మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యా సాగర్ అన్నారు. శుక్రవారం పీలేరు సబ్ యూనిట్ పరిధిలోని చల్లావారిపల్లెలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. కల్లూరు పీహెచ్ సి వైద్యులు ప్రవీణ్ తో కలసి ప్రాథమిక పాఠశాలలో దోమల వలన వ్యాప్తి చెందే జ్వరాలు, జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.