పోలవరం చెరువులో పాచి: వాహనదారుల ఆందోళన, యువకుల మానవత్వం

పోలవరం గ్రామంలోని రామసముద్రం చెరువులో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాచి కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. నిన్న ఇద్దరు గాయపడి, తిరుపతి ఆసుపత్రికి తరలించిన యువకులు. రెండు రోజుల క్రితం సచివాలయ సిబ్బంది VRO, VRA కూడా ఇక్కడ పడి గాయపడ్డారు. అయితే, పోలవరం సెక్రటరీ దీనిని పట్టించుకోవడం లేదని, రామాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాలు విరిగి, లక్షల రూపాయల ఖర్చు అయినా స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో స్పందించిన పోలవరం గ్రామ యువకులు పాచిని తొలగించి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్