పూతలపట్టు: 'నాణ్యమైన భోజనం వడ్డించాలి'

విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం తప్పనిసరిగా నాణ్యమైన భోజనం వడ్డించాలని డీఈఓ వరలక్ష్మి గురువారం సూచించారు. తవణంపల్లి తొడతొర జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓలు హేమలత, మోహన్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్