పూతలపట్టు: 'ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'

కాణిపాకం ఆలయం వద్ద వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ నరసింహులు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. కాణిపాకం ఆలయం మెయిన్ రోడ్ లో ఆటో స్టాండ్ నుంచి ఆర్చి వరకు వన్ సైడ్ పార్కింగ్ చేపట్టాలన్నారు. లాడ్జిల వద్ద దుకాణాల వద్ద కారు బస్సు భారీ వాహనాలు నిలపరాదన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్