బంగారుపాళ్యం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసిల్దార్ షబ్బీర్ భాషా ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, డీలర్లు నిబద్ధతతో పనిచేయాలని, కార్డుదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. గోడౌన్ నుండి వస్తున్న రైస్ షార్టేజ్ సమస్యలను గోడౌన్ వారితో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.