పుంగనూరు మండలంలో తల్లిపాలు వారోత్సవాలు ప్రారంభం

పుంగనూరు మండలంలోని మునిమాకులపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నేతిబుట్లపల్లిలో డాక్టర్ పవన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువులకు రోగ నిరోధక శక్తి పెంచే గుణాలపై ఆయన వివరించారు. ఏడురోజుల పాటు శిశు పోషణపై అవగాహన కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్