పుంగనూరులో ఆలయ అంగడి గదుల కూల్చివేత, భక్తుల ఆందోళన

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం చేసిన మూడు అంగడి గదులను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి జేసీబీతో కూల్చివేశారు. ఆలయ కమిటీ ఈ గదుల ఆదాయంతోనే ధూప దీప నైవేద్యాలు నిర్వహించేది. నేలమట్టమైన గదుల వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ భూములను కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్