చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం పోస్టాఫీసు సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వద్ద బట్వాడా కాని ఉత్తరాలు గుట్టలుగా పడి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల ముఖ్యమైన ఉత్తరాలు కూడా సకాలంలో చేరడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.