చిత్తూరు జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ యూనుస్ కు గురువారం ఎస్సైగా ప్రమోషన్ లభించింది. దీనితో మహమ్మద్ యూనస్ ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులలో జారీ చేశారు. ఎస్సైగా పదోన్నతి పొందిన యూనుస్ ను సిఐ సుబ్బారాయుడు, ఎస్సై వెంకటరమణ, పోలీస్ సిబ్బంది శాలువ తో సన్మానించారు.