ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రకటించిన రేటింగ్ లో పుంగనూరు మున్సిపాలిటీ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆదాయం, పారిశుద్ధ్యం, రోడ్లు, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ వంటి పది కీలక అంశాల ఆధారంగా ఈ రేటింగ్ ను అధికారులు ప్రకటించారు.