ఇళ్ల పక్కనే కంకర క్వారీలు.. గ్రామస్తుల నిరసన

సత్యవేడు మండలం చెన్నేరి గ్రామంలో నివాసాలకు సమీపంలో కంకర క్వారీల పేరుతో జరుగుతున్న ఎర్ర మట్టి తవ్వకాలపై గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. లారీలను అడ్డుకుని, తవ్వకాల వల్ల తమ ఇళ్లకు, జగనన్న ఇంటి పట్టాలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. క్వారీ అనుమతులు, తవ్వకాల నిర్వహణపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్