సత్యవేడు మండలం పుదుకుప్పం గ్రామంలో లార్వా నిర్మూలన కోసం శుక్రవారం పలుచోట్ల మలాథిన్ క్రిమిసంహారకమందును స్ప్రే చేశారు. స్థానిక ఎంపిటిసి, వైస్ ఎంపీపీ శరవన ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ నాగమణి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన, దాసుకుప్పం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ క్రిస్టల్ దాస్ పరిరక్షణలో మురుగు నీరు నిల్వ ఉన్నచోట, అపరిశుభ్రంగా ఉన్న పలుచోట్ల మలాథిన్ స్ప్రే చేయించారు. దీంతోపాటు విధులకు ఇరువైపులా పెరిగిన ముండ్ల చెట్లు, పిచ్చి మొక్కలను ప్రోక్లైన్ వాహనంతో తొలగించి పరిశుభ్రతను తీసుకొచ్చారు.