రాత్రి 10 తర్వాత షాపులు మూసివేయాలి

సత్యవేడు నాగలాపురంలో రాత్రి 10 గంటల తర్వాత అన్ని షాపులు మూసివేయాలని ఎస్సై సునీల్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చట్టవ్యవస్థ సమస్యలు, రాత్రివేళల్లో అనుచిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్