నారాయణవనం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న కొత్త తరగతి గదులను నెల రోజుల్లో పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్ పాఠశాల కమిటీ ఛైర్మన్ మోహన్ బాబుకు ఆదేశించారు. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి గదుల కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు.