ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ పరిసరాలు, పారిశ్రామిక ప్రగతిని వీక్షించిన అధికారులు, స్థానిక మొండెలెజ్ పరిశ్రమను సందర్శించి ఉత్పత్తులు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించారు. శ్రీసిటీ ప్రతినిధులు వారికి ఆహ్వానం పలికి, శ్రీసిటీ ప్రగతిని వివరించారు.