శ్రీకాళహస్తి రూరల్ మండలం, తొండమాన్ పురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మహిళల భద్రతపై అవగాహన సదస్సును శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గ్రామ మహిళలు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నుంచి బయటపడే మార్గాలపై పోలీసులు వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100, 112, 181 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులపై అవగాహన కల్పించారు.