శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఈవీఎం భద్రతా గోదాములను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాముల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. 24 గంటల పోలీసు పహారా, ఫైర్ సేఫ్టీ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.