ఏర్పేడు: ‘ఆ భూమి మాదే”

శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం చెల్లూరులోని పాఠశాల స్థలంపై వివాదం నెలకొంది. భూమి యజమానులుగా చెప్పుకుంటున్నవారు స్పందిస్తూ, '1962లో చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశాం. ఆ పత్రాలన్నీ మా వద్ద ఉన్నాయి. స్కూల్ పక్కన మిగిలిన 16 సెంట్ల భూమి మాదేనని కోర్టు తీర్పు ఇచ్చింది. అక్రమ రిజిస్ట్రేషన్ అని తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు. ఈ వివాదంపై భూ యజమానులు తమ వాదనలను స్పష్టంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్