తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వద్దు: ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి దేవస్థానంపై అమెరికాకు చెందిన జ్యోతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని దేవస్థానం ఈవో తెలిపారు. ఆమె స్వయంగా తన తప్పును ఒప్పుకుని సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కొంతమంది కావాలనే దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అధికారుల నుంచి వివరణ తీసుకొని కథనాలు ప్రచురించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ బోర్డ్ సభ్యులు గోపీనాథ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్