శ్రీకాళహస్తి పట్టణంలో కాలువల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, గోనె సంచులు పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల కాలువలు పూర్తిగా మూసుకుపోయి నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువల శుభ్రతపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.