మున్సిపల్ అధికారులు మా గోడ ను నిర్మించండి.

శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారంలో మున్సిపల్ అధికారులు కాలవల విస్తరణలో భాగంగా దోబీ ఘాటును ఆనుకొని ఉన్న గోడను కూల్చివేశారు. ఈ గోడ స్మశానానికి వెళ్లే మార్గంలో రక్షణగా ఉండేదని, దానిని పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. కాలువలు నిర్మించేటప్పుడు ఈ దారి గుండానే స్మశానానికి వెళ్లాల్సి వస్తుందని, గోడ లేకపోతే కాలవలో పడే ప్రమాదం ఉందని బీపీ అగ్రహారం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గోడను తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని వారు తెలిపారు. గతంలో ఉన్న గోడను పునర్నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్