కమ్మకొత్తూరుకు శ్మశాన సౌకర్యం కల్పించండి

శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని కమ్మకొత్తూరు గ్రామస్తులు, సీపీఎం నాయకులు సోమవారం ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామం ఏర్పడి 150 ఏళ్లు గడిచినా శ్మశాన స్థలం, దారి లేదని, దీంతో 200 కుటుంబాలు అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి శ్మశాన సౌకర్యం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్