శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ కె. వి. కృష్ణారెడ్డి పట్టణంలోని చాపల మార్కెట్ను సందర్శించి, షాపు యజమానులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో రాజీ పడేది లేదని, శ్రీకాళహస్తిని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.